Saturday, October 10, 2009

Linkedin

లింక్డిన్ అనే సాంఘికాల్లిక నెలవు (social networking site) ఉందని పలువురికి తెలిసిన విషయమే కదా? నిన్ననే నా స్నేహితుడొక్కడు ఎంతో కాలం తరువాత లింక్డిన్ ద్వారా వేగు పంపి మళ్ళీ జట్టు కడదామన్నాడు. చాలా ఆనందించి, తట్టుకోలేక ఓ మత్తేభాన్ని వదిలాను. జంధ్యాల చిత్రంలో గ్రాంథిక భాష మాట్లాడే పాత్రలా మారిపోయాననుకున్నాడో ఏమో, ఇప్పటి దాకా ప్రత్యుత్తరం పంపలేదు!!

బహు కాలమ్ముకు స్నేహితుల్ ముదము పెంపారంగ పూర్వంపు
సహవాసమ్ములు గుర్తెఱుంగను, లెస్సైనట్టి సాయమ్ముగా
ఇహలోకంబున నున్న గూడు మన లింక్డిన్నే, కదా మిత్రమా!
అహ! నీ వేగును చూచి నే నమితమౌ ఆనందమున్ బొందితిన్!!