సీ. బుద్ధిగడ్డిమెసవి శ్రద్ధసన్నగిలిన చవటడు బడికేగె చదువకుండ
వ్రాతపరీక్షల వానిపటిమ గన్న గుండుసున్నలె దేలు మెండుకొనుచు
గట్టెక్కు మార్గమ్ము గట్టిగా వెదకి నకలుకొట్టజూచె కుడికెలకువాని
వడివడిగ నకలువ్రాయుచునుండగ కంటబడెను వానికంతలోన
ఆ. ఈగ ప్రక్కవాని కాగితమున చచ్చి,
వేగ చవటకూడ ఈగబట్టి
తన జవాబుపత్రమునను మక్ఖికిమక్ఖి
యన్నమాటపుట్ట నతుకవెట్టె
(మెసవి - తిని, మెండుకొను - ఎక్కువై, కెలకు - ప్రక్క)
అదీ కథ. మక్ఖికిమక్ఖి అనే హిందీపదబంధ మలా పుట్టిందని మా ఆచార్యులు చెప్పగా విన్నాను. ఈగ చిత్రానికి సంబంధించిన చవిచూపుదృశ్యకం (ట్రెయిలర్) నేడు నా కంటబడింది. వెంటనే చిన్ననాటికథ జ్ఞాపకం వచ్చేసింది.
ఎందుకో తెలియాలంటే, మీ రీ రెండు పరిచయచిత్రాలూ చూడవలసిందే.
ఈగ చవి
The girl with the dragon tattoo
ఏమంటారు, మక్ఖికిమక్ఖియేనా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment