కంది శంకరయ్యగారు నేడు ఇచ్చిన సమస్య ఇది
మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్
నా పూరణ
భూతేశుని ఫాలాక్షుని
యా తెల్లనిదొర పశుపతి యసమాక్షుని సం
ప్రీతుని నాట్యకళాని
ర్మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్
మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్
నా పూరణ
భూతేశుని ఫాలాక్షుని
యా తెల్లనిదొర పశుపతి యసమాక్షుని సం
ప్రీతుని నాట్యకళాని
ర్మాతను తన పతిగఁ గొని యుమాసతి మురిసెన్
భూతేశుడు, ఫాలాక్షుడు, తెల్లనిదొర, పశుపతి, అసమాక్షుడు - ఇవి శివునికి పేర్లు. ఆయననే నటరాజు అంటారు కదా, అదే రీతిలో నాట్యకళానిర్మాత అని సంబోధించాను.
No comments:
Post a Comment