Monday, March 29, 2010
ఆటవెలది, మానవతి
ఆటవెలది మాటలాటలు మానవతికి సరిపడు రీతి
పూరించండి
Sunday, March 28, 2010
మల్లాది సోదరుల కచేరి
సింగపూరు లలితకళా క్షేత్రము సిఫాసు (SIFAS) నిర్వహించిన ఈ ఏటి యాభై కచేరీలలో ఎస్ప్లనేడు వేదికపై జరిగినవి ఐదు. ఈ ఐదు కచేరిలకీ ఉద్దండులైన విద్వాంసులని ఆహ్వానించారు - వాటిల్లో నేను వెళ్ళి చూసినవి మూడు. క్రితం వారం కద్రి గోపాలనాథ్ గారి సీమసన్నాయి (saxophone) వాయిద్యము, మొన్న శశాంక్ సుబ్రహ్మణ్యము మరియు తేజేంద్ర నారాయణ మజుమ్దార్ల జుగల్బందీ , నిన్న మల్లాది సోదరుల గాత్ర కచేరి. నేటి ఉదయము (చైత్రశుధ్ధ త్రయోదశి) సిఫాసు వేదిక వద్ద కర్ణాటకసంగీత త్రైమూర్త్యపూజకై మల్లాది సోదరులు ఉచిత కచేరి జరిపారు. నన్ను ఎక్కువగా ప్రభావితం చేసినది మల్లాది సోదరుల కచేరిలే అనడంలో సందేహము లేదు, వారి గాత్ర పటిమ, వాక్స్పష్టత, హావభావ ప్రకటన నన్ను ముగ్ధుణ్ణి చేసాయి. వారికి భక్తితో నేను అర్పించిన ఉత్పలమాల ఇదిగో
వాడి శరమ్ములై దనరె ప్రాతనొకానొక దండకంబునన్
వాడి శరమ్ములన్ దనర వైచిన దాశరథుల్ తలంపులన్
గూడిరి కూడి పాడగనె కూరిమికంఠ సరస్వతీసుతుల్
వారు నిన్న సాయంత్రము పాడిన భైరవి కృతి - తనయుని బ్రోవ - నా చెవులలో ఇంకా మ్రోగుతూనే ఉంది.
Friday, March 26, 2010
సమస్యా సప్తాహము ౭
అష్టకష్టములు చూసావే పడేయాలిగా చెవిలో నీకొక బూతుమాట
పూరించండి
Friday, March 19, 2010
సమస్యా సప్తాహము ౬
క్రింది శ్లోకాన్ని ఏకశ్లోక భాగవతము అంటారు. దీన్ని మీకు నచ్చివ వృత్తంలోకి అనువదించండి.
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీగృహేవర్ధనం
మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోధ్ధారణం
కంసఛ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం
హ్యేతత్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం
సమస్యా సప్తాహము ౫
సులభమైన సమస్య
పాతిపెట్టినవి జటాయు ప్రీతిగ తినె
పూరించండి
Thursday, March 18, 2010
సమస్యా సప్తాహము ౪
ఈ రోజు దత్తపది
ఏజీ, ఓజీ, లోజీ, సునోజీ
పదాలు ఉపయోగించి ఆదిశేషావతార రామానుజ లక్ష్మణస్వామి గురించి ఒక పద్యం చెప్పండి
సమస్యా సప్తాహము ౩
సులభమైన సమస్య
పూరంచండి
Wednesday, March 17, 2010
సమస్యా సప్తాహము ౨
బొంగురెలుంగునెత్తి యలవోకగ శ్రావ్యపు పాటపాడెనే
పూరించండి.
Monday, March 15, 2010
సమస్యా సప్తాహము ౧
విరోధి నామ వత్సర చిట్టచివరి రోజుల్లో పొద్దువారి పుణ్యమా అని కవిమిత్రులతో కలిసి అంతర్జాలావధానములో పాల్గోన్న తరువాత నేను రెండు రోజులపాటు బెంగపెట్టుకున్న మాట వాస్తవమే – దీన్నే రుగ్మతాగ్రగణ్య క్రౌంచదేశవాసులు విత్డ్రాల్ సింప్టమ్మని వ్యవహరిస్తారు. ఇటువంటి బాధకు లోనైయున్న మిత్రులకి మృదువాలుపు నందించాలనే (సాఫ్ట్ లాండింగ్) తలంపుతో నేను ఈ సమస్యా సప్తాహానికి శ్రీకారం చూట్టాను.
తొలి సమస్య,
తీయని వేపపూవు చిఱుతిండిగ పెట్టెను తల్లి ప్రేమతో
పూరించండి.
వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు
తే. మున్ను విఘ్ననాయకునికి మోకరిల్లి
తల్లి పాదపద్మములకు దండములిడి
భక్తితోడ నారాయణు ప్రస్తుతించి
ఇష్టదైవమ్ములకు గుడపిష్టమిచ్చి
షడ్రుచుల కలగలిపి పచ్చడిని పంచి
పుణ్యముల మూటగట్టగ పూజచేయ
వికృతి నామవత్సరమిక సుకృత యౌను
Subscribe to:
Posts (Atom)