Friday, November 11, 2011

భారతావతరణము - ౨

చిన్న లెక్క. విప్పగలరేమో చూడండి. పద్యం అర్థమైతే లెక్కతేల్చడం క్షణంలోపని, చూడండి.
చినమల్లనగారు గణితసారసంగ్రహమను పుస్తకము వ్రాయబూనుట, వేములవాడ భీమనను అప్పుడప్పుడు ఛందోవిషయములను గూర్చి ప్రశ్నించుట - ఇది పూర్వరంగము.

చెలికి షడంశమున్ ప్రియకు శేషములోపల పంచమాంశమున్
బొలుపుగ దానిశేషమున బోదకు నాల్గవపాలు నిచ్చి యం
దుల తనపాలు దాఁగొనియె తొమ్మిది జేనలు రాజహంస మీ
నలినమృణాళ మెంత సుజనస్తుత, మా కెఱగంగఁ జెప్పుమా

(జేన అంటే జాన. పతంగులకి దారం కట్టండానికి వాడే కొలమానం గుర్తుతెచ్చుకోండి చాలు)

ఇంతకీ నలినమృణాళము (తామరతూడు) పొడవెంత.

2 comments:

  1. paddenimidi jena le kada. Cheliki shadamsamu (1/6) poga 15, priyaku seshamu lo panchamamsamu (1/5) poga 12, boda ku seshamu lo nalgava palu (1/4) poga thana palu 9.

    Padyam chala bagundi sahityamu dvara sastramunu vyapimpachesinanduku china mallana gariki anantha (infinite) dandalu

    ReplyDelete
  2. రవి, సరియైన సమాధానం చెప్పావు. మఱొక జాలవేదికలో ఇదే ప్రశ్న వేస్తే భైరవభట్లకామేశ్వరరావుగారు చెప్పన సమాధానము ఇదిగో

    కం. సరిగా రెండు సగమ్ములు
    సరగున గావించి యొక్క సగమును దానే
    వెరవున గొని శేషమ్మును
    సరిపాళ్ళుగ బంచె హంస సరసిజబిసమున్

    ReplyDelete