నులు కమోడిటి లోటిసిలను పట్టి
స్వాప్షన్లు, కూపన్లు, కాప్షన్ల కొనుగోళ్ళు
వరిసోయ వణిజుల వర్తకముల
డెరివేటివులు పట్టి దరినున్న విత్తపు
రిస్కుల పట్టి, ప్రైస్డిస్కవరిల
పట్టి, తెగిడి కుస్తి పట్టిన తరుణాన
వేడెక్కి పోయింది మాడు మాడి
దెబ్బతిన్నబుఱ్ఱ, దీని దుంప తెగ, పా
త స్థితిగతులను బడి సుస్థిమిత మతిగ
కావడానికున్న త్రోవ యొకటె, హిట్ద
బాటిలందురట్టి పధ్ధతిని జనులు
==
డెరివేటివ్సు గురించి కూలంకషంగా చదువుతున్న నాకు బ్రేకు తీసుకోవాలనిపించి, 'కుప్పెతాడన' మెలాగూ అలవాటు లేదు కాబట్టి, (సీసా పట్టలేను కాబట్టి) సీసంతో సరిపెట్టుకున్నాను.
కుప్పె: glass bottle
కుప్పె తాడనమా? హహ్హ! గొప్పవారె!
ReplyDeleteబుఱ్ఱ వేడెక్క, సీసాను ముట్టకుండ,
మద్యమునకు బదులు సీసపద్యములను
వ్రాయ మీకు మాత్రమె తగు, భలె! భలె! భలె!
బుఱ్ఱ బాగా వేడెక్కినట్టుందండీ... ఎత్తుగీతి విచిత్రంగా వ్రాసారు. ఆటగీతి అనుకుంటాను. :)
పొఱపాటే సుమీ. మీకు చెప్పేదేముంది, చిన్న సవరణలతో ఆటగీతని తేటగా మార్చవచ్చు..
ReplyDeleteదెబ్బతిన్నబుఱ్ఱ, దీని దుంప తెగ, పా
త స్థితిగతులకొచ్చి సుస్థిమితముగ
కావడానికున్న త్రోవ యొకటె, హిట్ద
బాటిలని జనులను పధ్ధతదియె