Showing posts with label సూవృతోక్తి. Show all posts
Showing posts with label సూవృతోక్తి. Show all posts

Monday, July 26, 2010

సూవృతోక్తి ౧

ఆ. రాజకీయ మందు రాచపదవు లందు
విజ్ఞు డున్న చోటె నజ్ఞు డుండు
మేటి సంస్థలందు మేరు స్థానములందు
విజ్ఞు డెదుగు చోట నజ్ఞు డుబ్బు

ప్రేరణ:
౧. Some people grow, other people swell. You'd better figure out who you are
- John Weinberg, Senior partner and Chairman, Goldman Sachs, 1976-1990
Goodbye Gordon Gecko పుస్తకము నుండి సంగ్రహించినది

౨. In Washington some men grow, others merely swell
- Woodrow Wilson, American president, 1913-1921
Anatomy of a murder పుస్తకము నుండి సంగ్రహించినది

Wednesday, May 12, 2010

కార్యసాధకులు

పేరుకై ప్రాకులాడని వారు కార్య
సాధకులయి మున్ముందుకు సాగునపుడు
వారి కందని శిఖరాలు వారు పొంద
లేని గమ్యాలు లే విలలోన చూడ