ఉ. సత్పురుషుండు కావలె, కుశాగ్రమతిన్ చెలువొందు విజ్ఞుడే
తత్పరిపక్వ భాతి సహితామిత భూతి గడించి, పొందు మ
చ్చిత్పరిపూర్ణ ప్రేమము విచిత్ర చమత్కృత కృత్య పూర్ణుడై,
మత్పతియై తరించు నరమాన్యుడు క్ష్మాసురుడై జనించుచో
తాత్పర్యము. నాకు మంచి స్వభావము గల మగవాడు కావలెను. పదునైన బుధ్ధిబలము గలిగి, యట్టి పరపక్వ విజ్ఙతకు తోడుగా అమితములౌ సంపదలు గడించిన వాడైయుండవలెను. చతుర సరసుడై యుండిన వాడు, ఇతరుల గౌరవమునందిన వాడు, బ్రాహ్మణుడై పుట్టిన యెడల, నా యొక్క ప్రేమకు పాత్రుడై, నా పతియై తరియించు గాక.
తే. భరతఖండంబు పరదేశవాంఛ వీడి
శీతలావరణంబుల జీరలాడి
ఘర్మకణధారలోడ్చక కష్టమూని
పచ్చపత్రము గెలిచిన వాడె వలయు
తా. భారతదేశమును వీడి శీతల ప్రదేశాలలో తన గృహము నేర్పఱచుకొని చెమట లోడ్చు టక్కరలేని కష్టముల భరించి పచ్చపత్రము (గ్రీన్కార్డు) సాధించినవాడు కావలెను.
కం. సత్యవచో తేజమునన్
సత్య హరిశ్చంద్రుని సరిసామ్యతవలయున్
నిత్య నెల జవ్వని వనుచు
ప్రత్యహమున్నను పొగడు నిబధ్ధత నందున్
తా. అనుదినము నా అందచందములను పొగడుటలో సత్యహరశ్చంద్రుని పోలిన సత్యవ్రతుడు కావలెను.
సీ. దాక్షిణ్య నాయకత్వంబున కృష్ణుడె
కావలయు నెఱసఖ్యత నెఱపుచు
నా యొక తోడనె, పాయక నాతోడు
నిలువంగ వలె నయోనిజ నిజసఖుని
వలె తలిదండ్రుల పల్కుల వమ్ముజే
సిన గాని నా యానతిని వలదన
క, నరసింహుని పోలికన్నుండియును నాత్మ
గేహమున బిడాలదేహు మాడ్కి
ఆ. నణిగి మణిగి యుండి యడుగులకు మడుగు
లొత్త వలయు నది మహత్తర మను
భావమున, నల కలజనావనుడెదురైన
వరుని జేతు వేచి వత్సరంబు.
తా. కృష్ణుని పోలిన సరసుడు, పల్కాంతలను సమముగా చూచుకొను నేర్పరితనము కలవాడయ్యు నా యెడనే ప్రేమకలిగిన వాడై యుండవలెను. సీతను వీడని రాముని వలె యుండి, తలిదండ్రుల నైన యెదిరించవచ్చుగాని నా యాన మీఱరాదు. పరజనులకు నరసింహుని వలె అగుపించవలె గాని, నా ముంగిట పిల్లివలె వ్యవహరించ వలెను. అట్టి గొప్పవా డెదురైనచో వానిని యొక సంవత్సరము వేచి చూడుమని, ఆవల పెండ్లయాడుదును.
అదండీ సంగతి.
పెళ్ళి కుమార్తెలకు నచ్చు వరు డెటువంటి వాడై యుండవలెనో కనుగొనుటకు నేటి అంతర్జాల పెళ్ళిపేరమ్మగూళ్ళు చూచిన తెలియును. అధిక సందర్భములలో పెళ్ళి కాని వారికి కళ్ళు తిరగడము, పెళ్ళైనవారికి కడుపుబ్బ నవ్వు రావడము తథ్యము. మీ కొఱకై ఒక మచ్చుతునక ఇదిగో...
(సందీప్ గారి టపా నుండి తీసుకున్నది)
(From a telugumatrimony profile:)
I want to look for a person who is really
- more than caring, affectionate, honest, disciplined, respectful
- who value for people and a responsible person.
- Not the least to mention should be settled abroad,
- have work permit
- fair and handsome
- may be willing to wait for an year so that we can get some time to discuss things
- Should be jovial, fun-loving
- love travelling, straight forward, friendly, traditional, trendy
- a perfect "man"
- belonging to VV - VAIDIKI family only.
- Note: I dont prefer to have an age gap of >3 years.
Thanks
Friday, May 27, 2011
Subscribe to:
Post Comments (Atom)
చక్కటి పద్యాలను వ్రాశారు గిరిధర్ గారు. మీకు నా అభినందనలు. నాకు ఈ పద్యాలలో కొన్ని కొన్ని పదాలు అర్థం కాలేదు. పద్యాలకు భావం కూడా వ్రాస్తే నా లాంటి పామరులకు ఇంకా బాగా అర్థమవుతాయి. అన్నట్టు ఎక్కడా foreign settlement, work permit గురించిన మాటలు కనబడలేదు?
ReplyDeleteసందీప్ గారు,
ReplyDeleteప్రతి పద్యము వెనుక తాత్పర్యమును తోడనే విదేశవాసమును గూర్చి మఱియొక పద్యమును జోడించినాను.
చాలా బాగున్నది
ReplyDeleteచాలా బావుందండీ.
ReplyDeleteఇలాటి భావంతోనే నేను 2008 లో ఎప్పుడో రాసికొన్న ఆంగ్ల కవితనొక దానిని ఇక్కడ చూడండి...http://drbr1976.blogspot.com/2008/09/fair-maidens-and-thier-impossible-wish.html