తెలుగు పదం గుంపులో టూత్బ్రష్ పైన జరిగిన చిన్న చర్చ, అందులో రెండు కంద పద్యాలు, ఇవిగో
నేను -
Toothbrushను పల్లకుంచె లేక పంటికుంచె అని వ్యవహరించవచ్చునని నా ప్రతిపాదన.
ఏమంటారు.
నమస్సులు, గిరి
సుబ్బాచారి గారు -
నేను -
నేను -
క. పిలుతురు బ్రష్షని కుంచెను
సులువుగ నాంగ్లంబున, నతి సులువుగ టూతై
చెలగెను పల్లున్, వాటిని
కలగలిపి నుడివిన వచ్చు గాదా టూత్బ్రష్చెలగెను పల్లున్, వాటిని
Toothbrushను పల్లకుంచె లేక పంటికుంచె అని వ్యవహరించవచ్చునని నా ప్రతిపాదన.
ఏమంటారు.
నమస్సులు, గిరి
సుబ్బాచారి గారు -
ఇదే ట్రూ ట్రాన్స్ లేషన్ అంటే. తెలుగువారికి చక్కని తెలుగు
మాట ఉంది కదా అదే మొఖంపుల్ల. చక్కగా అలా పిలుద్దాం. నాలికబద్ద అనేది మరొకటి
ఉందీ. అంటే టంగ్ క్లీనర్ అన్నమాట. అనువాదాలు చేసే ముందు మన తెలుగు పదాలు
వెదుకుదాం. సుబ్బాచారి పులికొండ.
నేను -
పద్యం హాస్యానికి :-)
క. మక్కికి మక్కీ యైనను
చక్కని యనువాదమెపుడు సరసమె చూడన్
ప్రక్కకు త్రోయన్ దగునే
చొక్కపు పదము పులికొండ సుబ్బాచారీ
కేవలం ట్రూ ట్రాన్స్లేషనని వదులుకోవద్దు, దేశ్యమైన పదము ఇప్పటికే ఉంటే అది వేఱు.
ముఖంపుల్లని నేను వినలేదు. నాలికబద్ద తెలుసు, వాడుతాను కూడా.
సుబ్బాచారి గారు -
మా ఖమ్మంజిల్లా లో ఈ మాట చాలా విస్తృతంగా వాడుకలో ఉంది. మీ పద్య కళ కూడా బాగుంది. సుబ్బాచారి
"పలుదోంపుల్ల" అంటే అది చేసే పనిని కూడా చెప్తుంది. అదీ అచ్చ తెలుగు నుడికారంలో, యెలా ఉంది?
ReplyDeleteమీరు చెప్పింది నిజమే. ఖమ్మం, గుంటూరు జిల్లాలో పల్దోముపుల్ల అనే వాడుక ప్రచారంలో ఉన్నదని ఆ చర్చవల్ల తెలిసింది
ReplyDelete