ముఖపుస్తక ఛందోసమూహములో ధనికొండరవిప్రసాద్ గారు ఇచ్చిన దత్తపది ఇది. మూడు, ఆరు, ఎడు, పది - ఈ పదాలను సంఖ్యాపరంగా కాకుండా వేఱే అర్థాలు వచ్చేలాగ వ్రాయాలి. పురాణేతిహాసాలు నేపధ్యంగా ఉండాలి.
ఇదిగో నా పూరణ
సీ. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడు
గండ్రగొడ్డలి పడి క్షత్రియు లారుట, వంగిన వంశము లంగలార్చు
నోడింప పదునాలు గేడులు పట్టుట, రణభూమి రావణు రాణు లేడ్చు
తిమిరము సమయింప దివినుండి దిగునట, కలిని వీడుకొలుపఁ దిలకు డొకడు
తే. మొదటి పాదమున జెలఁగు మూడు గాను
ఆపయిన పదపడి వచ్చు నారు గాను
పిదప తెలియు నేడును పదియు వరుసఁ
దరచిచూచిన హరి యవతారసంఖ్య
వివరణ ఇదిగో.
సీసపద్యములో నాలుగు పాదములు, ఒక్కో పాదానికీ రెండు భాగాలు, క్రింద నాలుగు పాదాల ఎత్తుగీతి. వ్రాసుకోవడానికీ, చెప్పడానికీ ఎంత ఉన్నా ఇన్ని పాదాలలో తప్పక పూరించవచ్చు.
నేను ఎంచుకొన్న ఇతివృత్తం - విష్ణువు యొక్క దశావతారాలలో నాలుగు అవతారాలు. నాలుగు పాదాలు, నాలుగు పదాలు, నాలుగు అవతారాలు - సరిగ్గా సరిపోతాయి.
కాస్త చమత్కారంగా ఉంటుందని సీసములో మొదటి పాదము మూడవ అవతారము, రెండవ పాదము ఆరవ అవతారము, మూడవ పాదము ఏడవ అవతారము, చివరి పాదము పదవ అవతారము చెప్పబూనాను. అదే విషయం ఎత్తుగీతిలో వివరించాను కూడా.
సీసపద్యాల పాదాలు
౧. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడు
ఘనుడు, అసుర కాలము - ఘనుడెవ్వరు, అసురుడెవ్వడు, ఈ ప్రశ్నలు ఉదయించవచ్చు. ఎలాగూ పద్యము హరి అవతారాలను గూర్చి కాబట్టి, అందులోనూ బ్రహ్మ (కంజుఁడు) కు వచ్చిన కష్ణము తీర్చిన అవతారమ మేమిటో చూస్తే, వరాహావతార మని తెలుస్తుంది. ఏవైఁనా అనుమానం మిగిలి ఉంటే ఎత్తుగీతిలో మొదటి పాదము అది కూడా తీరుస్తుంది.
ఇందులో మొదటి మూడు - కాలము మూడిందనే అర్థముతో, రెండవ మూడు సంధి వల్ల వచ్చినది. కష్టము + ఊడు, కష్టమూడు.
౨. పరశురామావతారము. క్షత్రియులు, ఆరుట లో అరు ఉన్నది. ఇక్కడ ఆరు అంటే ఓడిపోవడం లేక చనిపోవడం. వంగిన వంశములు అంగలార్చు -రెండవ ఆరు చివరన వస్తుంది. అంగలార్చు అంటే బాధపడడం.
౩. రామావతారంలో రావణుణ్ణి సంహరించడానికి పట్టింది పదునాలుగు + ఏడులు అంటే సంవత్సరాలు. మొదటి ఏడు అక్కడ. రావణుఁడు మరణించడంతో ఆయన రాణులు ఎడవడం - అక్కడ రెండవ ఏడు. పై పాదాలలో పదాలలలాగే రెండూ సంఖ్యా పరంగా రాలేదు.
౪. ఇక చివరి పాదము, (పాపాపు) చీకటిని పారద్రోలడానికి - సమయింప దివినుండి..ఇందులో పది ఉన్నది. కలిని వీడుకొలుపన్, తిలకుఁడు - కలిసి వీడుకొలుపఁ దిలకుఁడు అయ్యింది. మఱియొక పది వచ్చింది. రెండూ మళ్లీ సంఖ్యాపరంగా రాలేదు.
ఇక మిగిలినది ఎత్తుగీతి. దావి భావము సులభగ్రాహ్యమే.
అదండీ సంగతి.

No comments:
Post a Comment