Monday, September 14, 2009

అమెరికాలో చిదంబరం

మన చిదంబరం పాపం అమెరికాలో ఒళ్ళూ పై (మై పై అనవచ్చా?) తెలియని ఉద్వేగానికి లోనైయ్యాడు. కేంద్ర ప్రభుత్వం పంపిన గూఢచర్య నివేదికలని రాష్ట్రాలు ఖాతరు చెయ్యకూడ దంటాడేమిటి, వీడి బొంద? ఈ విషయమై ఓ వ్యావహారికోత్పలమాల, కందము అందుకోండి.

సెంటరు వాళ్ళు చచ్చిచెడి సీక్రెటు టెర్రరుసెల్సు గూర్చి రా
ఇంటలిజెన్సు డాసియరు లెందుకు స్టేటుకి పంపడం? యమ
ర్జంటుగ దాన్ని నమ్మి తగు చర్యలు ఠక్కున తీసుకొంటె, చి
న్మెంటలు* డంతలో తెలివి మీఱి అబధ్ధములేల వాగడం?

పంపినది తప్పు కాదా?
పంపిన దాన్ననుసరించి పగవాళ్ళని పై
కంపితె న్యాయం కాదా?
దుంపతెగ ఇదేమి వింత దొబ్బుడు? ఛీఛీ!!


చిత్ + mental = చిన్మెంటలు

2 comments:

  1. చిన్మెంటలు .. మీరు సృష్టిస్తున్నారు పెన్మంటలు!
    హ హ హ
    బాగుంది

    ReplyDelete
  2. "చిన్మెంటలు"గారి బొందెలూ దుంపలూ తెంపుతున్నారు కదా! :D

    ReplyDelete