Monday, March 15, 2010

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

తే. మున్ను విఘ్ననాయకునికి మోకరిల్లి

తల్లి పాదపద్మములకు దండములిడి

భక్తితోడ నారాయణు ప్రస్తుతించి

ఇష్టదైవమ్ములకు గుడపిష్టమిచ్చి

షడ్రుచుల కలగలిపి పచ్చడిని పంచి

పుణ్యముల మూటగట్టగ పూజచేయ

వికృతి నామవత్సరమిక సుకృత యౌను

2 comments:

  1. ఉగాది శుభాకాంక్షలు!!

    ReplyDelete
  2. సంవత్సరాన్ని నాతిని చేయడం మీకే చెల్లు! :)

    ReplyDelete