క్రింది శ్లోకాన్ని ఏకశ్లోక భాగవతము అంటారు. దీన్ని మీకు నచ్చివ వృత్తంలోకి అనువదించండి.
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీగృహేవర్ధనం
మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోధ్ధారణం
కంసఛ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం
హ్యేతత్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం
భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా
క్రింది శ్లోకాన్ని ఏకశ్లోక భాగవతము అంటారు. దీన్ని మీకు నచ్చివ వృత్తంలోకి అనువదించండి.
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీగృహేవర్ధనం
మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోధ్ధారణం
కంసఛ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాపాలనం
హ్యేతత్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం
ఇప్పుడే తెలిసింది మీ బ్లాగు గురించి. రీడరులో జోడించాను.
ReplyDeleteమీరు చెప్పిన శ్లోకం మా తాతయ్య చిన్నప్పుడు భట్టీయం వేయించారు నాతో. ఆయన గుర్తొచ్చాడు. కృతజ్ఞతలు.నా అనువాద ప్రయత్నం విలోకించండి.
తొల్లిని దేవకీ జనని నోముల పంటగ,గోపికావళీ
నిల్లులనాడి,బూచిఁ కడదేరిచి,గోగిరి నెత్తి దేవుఁడై,
యుల్లముఁ జీల్చి కంసుని,సుయోధను సోదర నాశమున్, సదా
చల్లగ పాండుపుత్రులను సారము గాచు పురాణగాథగా
చెల్లుచు కృష్ణుఁ లీలఁ బ్రవచించెడు భాగవతంబిదే యిలన్.
రవి గారు,
ReplyDeleteబాగా వ్రాసారు.
ఇలాంటిదే ఏకశ్లోక రామాయణము కూడా ఉన్నది తెలుసా? అది కూడా మీరు కంఠస్థం చేసారా?
రవిగారూ! బాగుంది మీ పద్యం..'బూచి కడదేరిచి ' మంచి ప్రయోగం..
ReplyDeleteగిరి గారూ, ఇది ఏకశ్లోకి ఔనోకాదో తెలీదు. రామాయణ సంగ్రహి అని చదువుకున్న గుర్తు..
ఆదౌ రామతపోవనాది గమనం హత్వామృగం కాఞ్చనం
వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవసంభాషణం
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం
పశ్చాత్ రావణకుంభకర్ణహననం తు ఏతత్ హి రామాయణమ్
సనత్ గారు, గిరి గారు: ధన్యవాదాలండి. బూచి - రెండక్షరాల పూతన దొరక్క చేసిన ప్రయోగం. :-)
ReplyDeleteరామాయణం శ్రీపతి గారు చెప్పారు. కానీ ఇది వాల్మీకి విరచితం కాదని అనుకుంటున్నాను.
సనత్ గారు, నేను ప్రస్తావించిన శ్లోకము అదేనండి.
ReplyDeleteపూతనను బూచి అనడం బావుంది. ఈ పిట్టకథ ఎంతవఱకు నిజమో తెలియదు కానీ, తాండ్రపాపారాయుని వైరి బుస్సీ పేరు నుండి తెలుగునాట బూచి అనే వాడుక ప్రసిధ్ధమైనదని చెబుతారు. అదే నిజమైతే, పరంగులు మనదేశానికి రావడం వల్ల రవి గారి ప్రయోగం సాఫల్యమయ్యింది :-)