విరోధి నామ వత్సర చిట్టచివరి రోజుల్లో పొద్దువారి పుణ్యమా అని కవిమిత్రులతో కలిసి అంతర్జాలావధానములో పాల్గోన్న తరువాత నేను రెండు రోజులపాటు బెంగపెట్టుకున్న మాట వాస్తవమే – దీన్నే రుగ్మతాగ్రగణ్య క్రౌంచదేశవాసులు విత్డ్రాల్ సింప్టమ్మని వ్యవహరిస్తారు. ఇటువంటి బాధకు లోనైయున్న మిత్రులకి మృదువాలుపు నందించాలనే (సాఫ్ట్ లాండింగ్) తలంపుతో నేను ఈ సమస్యా సప్తాహానికి శ్రీకారం చూట్టాను.
తొలి సమస్య,
తీయని వేపపూవు చిఱుతిండిగ పెట్టెను తల్లి ప్రేమతో
పూరించండి.
మాయని నవ్వు మోవిపయి, మారది పల్కని ఓర్మిగల్గియే
ReplyDeleteమోయక ద్వేషమే,పతికి మోదము గూర్చుచు, పంటికిందనే
దాయుచు కష్టమున్, మనుము, దైతగ నూతన పాత్రనొంది, ఇం
తీ, యని వేపపూవు చిఱుతిండిగ పెట్టెను తల్లి, ప్రేమతో
"వ్రాయగ జూడుమో సుతుడ ! వ్రాయుచు సాధన చేసి చూడ నో
ReplyDeleteహో యను పద్యముల్ మృదు మహోజ్వల ధారల జాలువరు" నన్
చాయమ రాఘవార్యులకు చక్కగ నేర్పిన విద్య చూడుడీ !
"తీయని వేపపూవు చిఱుతిండిగ పెట్టెను తల్లి ప్రేమతో "!
తినగ తినగ వేము తియ్యనుండు కదా... రాఘవార్యులు అద్భుతమైన ధారతో పద్యాలు వ్రాయగలగటానికీ, వారి ప్రతిభా విశేషాలకూ కారణం, వారి తల్లిగారు ఉగ్గుపాలతో "చిన్నప్పటి నుండీ సాధనా చేయమని" నేర్పినదై ఉంటుందని నా నమ్మకం...
ఊకదంపుడు గారు,
ReplyDeleteరుచించని తల్లిమాటని వేపపూవుతో పోల్చి బాగా పూరించారు. భేషో.
సనత్ గారు,
తినగ తినగ తియ్యనుండు అనే విషయం పద్యంలోనే ఇమిడ్చి ఉంటే బావుంటుందని నా అభిప్రాయము.
ఇక నా పూరణ ఇదిగో
తీయని నీటిబొండమని తీసుకువచ్చిన కోనసీమటెం
కాయని కొట్టినంతటనె కన్పడె కొబ్బరిపూపు చిట్టిపా
పాయికి తల్లివెంటపడి ప్రాణము తోడుచు వేగ దాన్ని తీయ్
తీ యని వేప, పూవు చిఱుతిండిగ పెట్టెను తల్లి ప్రేమతో
తీయనిదంచు నో శిశువిదేమని నోటనిడంగ బోవఁగా
ReplyDeleteతీ యని వేపపూవుఁ; చిఱుతిండిగ పెట్టెను తల్లి ప్రేమతో
తీయని పాయసంబు నట దేవుఁ నివేదనఁ భక్తిఁ గూర్చియుం
తీయుఁ ప్రసాదమున్ నగవు నెమ్మొగమొప్ప యుగాది రోజునన్
శ్రీపతి గారి పూరణ అదరహో..
"రుగ్మతాగ్రగణ్య క్రౌంచదేశవాసులు" అర్ధం చెప్పరా..ప్లీస్
ReplyDeleteరుగ్మతాగ్రగణ్య...వరకూ అర్ధమైంది. మిగతాది అర్ధం కాలేదు.
ReplyDeleteక్రౌంచ దేశవాసులంటే అమెరికన్లు. అమెరికాలో పురోహితుల ఆవాహన మంత్ర పాఠాన్ని గమనిస్తే 'జంబూద్వాపే భరతఖండే' కి ప్రత్యామ్నాయంగా 'క్రౌంచద్వాపే' అని చెబుతారని విన్నాను. అమెరికాలో ఐదేళ్ళపాటు బసచేసినా ఈ విషయాన్ని ప్రత్యక్షంగా వినలేదు, ఎవరో చెప్పగా విని వాడుకలోకి మాత్రం అన్వయించుకున్నాను
ReplyDelete